Breaking News

కేంద్ర మంత్రి రాజీనామా.. ఎందుకంటే?

Published on Fri, 07/24/2026 - 21:20

ఢిల్లీ: పంజాబ్ బీజేపీ నేత, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ శుక్రవారం తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 2024 నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఆయన.. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం పూర్తి కావడంతో రాజీనామా చేశారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనలో ఉన్న ఈ సరిహద్దు రాష్ట్రంలో వచ్చే ఏడాది బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడైన బిట్టూ.. 2024లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అనంతరం కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఖాళీ చేసిన రాజస్థాన్ రాజ్యసభ స్థానానికి నామినేట్ కావడంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఇటీవల దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' సినిమాపై బిట్టూ విమర్శలు గుప్పించారు. పంజాబ్‌కు సంబంధించిన పలు సున్నిత అంశాలున్నాయని.. ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందన్నారు. 
 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)