ఒమర్, రిజిజు భేటీపై  రాజకీయ వివాదం

Published on Tue, 04/08/2025 - 05:41

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌లో కలుసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. వక్ఫ్‌ చట్టం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) సానుకూల వైఖరి అవలంబించిన నేపథ్యంలోనే వీరిద్దరు కలుసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా కోరిక మేరకు తులిప్‌ గార్డెన్‌కు వెళ్లిన ఒమర్‌కు అనూహ్యంగా అదే రోజు ఉదయం గార్డెన్‌కు వచ్చిన మంత్రి రిజిజు కలిశారని అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అంటోంది.

 యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం  ఎవరికి వారు వెళ్లిపోయారని చెబుతోంది. ఇదంతా కేవలం అనుకోకుండా జరిగిన పరిణామమని, దీన్ని అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించింది. అయితే, రిజిజు ‘ఎక్స్‌’లో అబ్దుల్లాలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేయడం వివాదాన్ని రేపింది. వక్ఫ్‌ సవరణ చట్టంపై బీజేపీకి ఎన్‌సీకి లొంగిపోయిందని ప్రతిపక్ష పీడీపీ ఆరోపించింది. పార్లమెంట్‌లో వక్ఫ్‌ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రిజిజుకు తులిప్‌ గార్డెన్‌లో ఎన్‌సీ ఎర్ర తివాచీ పరిచిందని మరో నేత అన్నారు. సీఎం ఒమర్‌ తులిప్‌ గార్డెన్‌లో తారసపడిన కేంద్ర మంత్రి రిజిజుకు కనీసం దూరంగా ఉండటం ద్వారా నిరసన తెలిపి ఉండాల్సిందని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ సజాద్‌ లోనె పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)