Breaking News

కుమారస్వామిపై కేసు

Published on Wed, 11/06/2024 - 05:05

బెంగళూరు: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామిపై కర్ణాటకలో కేసు నమోదైంది. 2006–08 కాలంలో కర్ణాటక సీఎంగా ఉన్న కాలంలో కుమారస్వామి ఒక గనుల తవ్వకం సంస్థకు అక్రమంగా మైనింగ్‌ అనుమతులు ఇచ్చారని గతంలో ఒక కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సారథ్యం వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎం.చంద్రశేఖర్‌ తాజాగా ఫిర్యాదుచేయడంతో బెంగళూరులోని సంజయ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కుమారస్వామిపై కేసు నమోదైంది.

కుమారస్వామి ప్రభుత్వ అధికారిగా తన విధి నిర్వహణకు అడ్డు తగులుతున్నారని, తనను బెదిరించారని చంద్రశేఖర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించి నాడు బళ్లారి జిల్లాలో శ్రీసాయి వెంకటేశ్వర మినరల్స్‌ సంస్థకు 550 ఎకరాల్లో గనుల తవ్వకం అనుమతులు ఇచ్చారని కుమారస్వామిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

కుట్రపూరిత కేసు: కుమారస్వామి
తాజా కేసుపై కుమారస్వామి స్పందించారు. ‘‘ ఇది పూర్తిగా కుట్రపూరితంగా నమోదుచేసిన కేసు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నన్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఐజీపై నేను పత్రికాసమావేశంలో ఆరోపణలు చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నిజమని నిరూపించగలరా? కావాలంటే ప్రెస్‌మీట్‌ వీడియోను మరోసారి చూడండి. ఈ కేసును నేను చట్టప్రకారమే ఎదుర్కొంటా’’ అని మంత్రి అన్నారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)