Breaking News

కోల్‌కతా కేసులో మోదీకి లేఖ.. సీఎం మమతకి కేంద్రం కౌంటర్‌

Published on Sat, 08/31/2024 - 08:51

ఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ లేఖపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి స్పందిస్తూ దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బెంగాల్​లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నప్పటికీ.. పనితీరు బాగా లేదని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో ప్రధాని మోదీ నేరుగా స్పందించాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ క్రమంలో 22వ తేదీన ఈ ఘటనపై తాను లేఖ రాసినా ఎలాంటి సమాధానం రాలేదని శుక్రవారం రాసిన మరో లేఖలో ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమత లేఖపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవీ స్పందించారు.

ట్విట్టర్ వేదికగా అన్నపూర్ణా దేవీ.. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలకు సంబంధించి కఠినమైన చట్టాలు, శిక్షలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. కానీ, బెంగాల్‌లో ఫాస్ట్‌ కోర్టుల పనితీరు బాగాలేదు. పశ్చిమ బెంగాల్‌లో 48,600 అత్యాచార, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యాచారం, పోక్సో కేసులను ప్రత్యేకంగా పరిష్కరించేందుకు బెంగాల్‌ ప్రభుత్వం అదనంగా 11 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అమలు చేయలేదు. ఇవి ప్రత్యేకమైన పోక్సో కోర్టులు లేదా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసులు రెండింటినీ విచారిస్తాయి అని చెప్పుకొచ్చారు. ముందుగా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని హితవు పలికారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)