Breaking News

తెలంగాణలో ఒంటరి పోరే

Published on Wed, 06/10/2026 - 06:00

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. తెలంగాణతో­పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా తమకు ఒక స్పష్టత ఉందన్నా­రు. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చు­కొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని భారత్‌ మండంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ అన్యాయం జరగదు..: డీలిమిటేషన్‌ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో తీవ్రత లేదని అమిత్‌ షా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. లోక్‌సభలో ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతమున్న నిష్పత్తి ప్రకారం అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అందుకు కావాల్సిన మద్దతు లభించగానే బిల్లును ఆమోదింజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.  

బిల్లుకు అవసరమైన మద్దతు అభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వన్‌ నేషన్‌ వన్‌ బిల్లుపై ప్రస్తుతం కమిటీ అధ్యయనం చేస్తోందని.. నివేదిక రాగానే సబంధింత బిల్లుకు అవసరమైన మద్దతు లభిసుందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలు బలంగానే ఉన్నాయని.. తమతో కలిసి నడుస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకీ ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మధ్యప్రదేశ్‌ రాజ్యసభ సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ వేసిన నామినేషన్‌ తిరస్కరణతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమలనాథ్‌ ఆమె నామినేషన్‌ పత్రాలను నింపారు కాబట్టే తిరస్కరణకు గురై ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు.  

#

Tags : 1

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)