Breaking News

లోక్‌సభలో వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లు

Published on Mon, 12/15/2025 - 16:09

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ శీతాకల సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం, డిసంబర్‌ 15వ తేదీ) లోక్‌సభలో కేంద్రం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లు, మరొకటి ది రిపీలింగ్‌ అండ్‌ అమెండింగ్‌ బిల్లు. ఈ రెండు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లును జేపీసీ(జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ) పంపే అవకాశం ఉంది. 

వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లు అంటే..
ఉన్నత విద్య నియంత్రణను పూర్తిగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది.యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే గొడుగు కింద వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ (VBSA) అనే కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

12 మంది సభ్యులతో కూడిన వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ అనే అత్యున్నత కమిషన్ ఏర్పాటుచేసి, ఉన్నత విద్యా విధానాలు, ప్రమాణాలు, నాణ్యత నియంత్రణను ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా కేంద్రానకి అధిక అధికారాలుంటాయి. దీని ఫలితంగా ఉన్నత విద్య నియమ నిబంధనలు అనేవి కేంద్రం నియంత్రణలోకి వస్తాయి. ముందుగా ప్రతిపాదించిన భారత ఉన్నత విద్యా కమిషన్( Higher Education Commission of India  బిల్లును ఇప్పుడు వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లుగా మార్చారు.

ప్రయోజనాలు
సమగ్ర నియంత్రణగా అమలు చేయడానికి వీలవుతుంది.  అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే విధమైన ప్రమాణాలు.
విభిన్న సంస్థల మధ్య గందరగోళం తగ్గుతుంది.
ఒకే కమిషన్ ద్వారా విద్యా ప్రమాణాలు కఠినంగా అమలు చేయవచ్చు.


ది రిపీలింగ్‌ అండ్‌ అమెండింగ్‌ బిల్లు
పాత చట్టాలను రద్దు చేయడం లేదా వాటిలో మార్పులు చేయడం కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లు. ఇది కొత్త చట్టాలను తీసుకురావడానికి లేదా పాత చట్టాల్లోని అనవసరమైన, పాతబడ్డ నిబంధనలను తొలగించడానికి ఉపయోగిస్తారు

ఇప్పటికే ఉన్న చట్టాల్లో మార్పులు చేయడం. ఉదాహరణకు, ఒక చట్టంలోని సెక్షన్‌లో పదాలను మార్చడం, కొత్త నిబంధనలను చేర్చడం, లేదా పాత నిబంధనలను సవరించడం జరుగుతంది. దీని ద్వారా చట్ట వ్యవస్థను సులభతరం చేయడం జరుగుతుంది. 

రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ
మరొకవైపు రాజ్యసభలో  ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతుంది.  ఈ చర్చల్లో వైఎస్సార్‌సీపీ తరుఫున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో అనేక తేడాలున్నాయన్నారు. సీసీటీవీ ఫుటేజ అందుబాటులో ఉంచాలన్నారు. ఈవీఎంలను నమ్మలేని పరిస్థితి వచ్చిందని, పేపర్‌ బ్యాలెట్‌పై అందరికీ నమ్మకం ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)