Breaking News

మరో నాలుగేళ్లు ఫోర్టీఫైడ్‌ రైస్‌

Published on Thu, 10/10/2024 - 05:57

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో నాలుగేళ్ల పాటు ఉచిత ఫోర్టీఫైడ్‌ రైస్‌ అందించనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2028 డిసెంబర్‌ వరకు ఉచిత ఫోర్టిఫైడ్‌ రైస్‌ సరఫరా కొనసాగింపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. సూక్షపోషకాలైన ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి12లను బియ్యానికి జోడిస్తారు. దీన్నే ఫోర్టీఫైడ్‌ రైస్‌గా పిలుస్తారు. 2024 జూలై నుంచి 2028 డిసెంబర్‌ వరకు ఈ కార్యక్రమం అమలు కోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఫోర్టీఫైడ్‌ రైస్‌ ఉచిత సరఫరాను కొనసాగించడంతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేశారు. గుజరాత్‌లో ని లోథాల్‌లో జాతీ య మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎంహెచ్‌సీ)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్‌ఎంహెచ్‌సీ అభివృద్ధిలో 22 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. ‘ఫేజ్‌ 1ఎ’లో జాతీయ మారిటైమ్‌ హెరిటేజ్‌ మ్యూజియం, ఆరు గ్యాలరీలు ఉంటాయని వివరించింది. భారత నావికాదళం, తీరప్రాంత రక్షకదళం గ్యాలరీలు ఉంటాయని, దేశంలోనే అతిపెద్దవిగా ఇవి నిలుస్తాయని తెలిపింది. ఫేజ్‌–2లో తీరప్రాంత రాష్ట్రాల పెవిలియన్‌లు, మారిటైమ్‌ ఇనిస్టిట్యూట్, హాస్టల్, నాలుగు థీమ్‌ బేస్డ్‌ పార్క్‌లను ఏర్పాటు చేస్తారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)