Breaking News

తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే.. మూడోసారి కుప్పకూలిన వంతెన

Published on Sat, 08/17/2024 - 12:38

పాట్నా: బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న సుల్తాన్‌గంజ్‌-అగువానీ ఘాట్‌ వంతనెలోని ఓ భాగం కూలి ఒక్కసారిగా నదిలో పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఇదిలా ఉండగా గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన కూలడం ఇప్పటికి ఇది మూడోసారి కావడం గమనార్హం. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదేపదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2014, ఫిబ్రవరి 23న లో భాగల్పూర్‌ జిల్లాలోని సుల్తాన్‌గంజ్‌ - ఖగారియా జిల్లాలోని అగువానీ ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 మార్చి 9న నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం బిహార్‌ ప్రభుత్వం రూ.1,710 కోట్లు కేటాయించింది. ఇది భాగల్‌పూర్ నుంచి ఖగారియా మీదుగా జార్ఖండ్‌కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.

2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు. ముందుగా గతేడాది జూన్‌లో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలిపోగా తిరిగి నిర్మాణం చేపట్టారు. మళ్లీ జూన్‌ 4న మరోసారి కూలింది. నిర్మాణంలో ఉన్న వంతెన మూడుసార్లు కూలిపోవడంతో ప్రతిపక్షాలు నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

 దీనిపై స్పందించిన ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న ఎస్‌ కే సింగ్లా కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది. వంతెనను సొంత ఖర్చుతో పునర్నిర్మించాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఈ కంపెనీ ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)