Ayodhya Ram Mandir: 32 ఏళ్ల  తర్వాత అయోధ్యకు ఉమాభారతి

Published on Mon, 01/22/2024 - 15:31

అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహిం‍చారు. రామ్‌ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. అయితే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు రామ మందిర ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ ఘటన అక్కడ ఉన్నవారందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ దిగ్గజ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంబర మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగాని​కి లోనయ్యారు. వారిరువురు తాము కన్న కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో సాధ్వి రితంబర కళ్లు చెమర్చాయి. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాడిన ఈ నేతల కలసాకారమైంది. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

సుమారు 32 ఏళ్ల  తర్వాత నేడు రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అమె అయోధ్యలో అడుగుపెట్టారు. ‘నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉ‍న్నాను. రామ్‌ లల్లా దర్శనం కోసం వేచి ఉ‍న్నా’ అని ఉమాభారతి  మందిరం ముందు దిగిన ఫొటోను ‘ఎక్స్’ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.  1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో ఉమాభారతి, సాధ్వి రితంబర కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖలు హాజరై తిలకించారు.

చదవండి:  Ayodhya Ram Mandir: అయోధ్య కొలువుదీరిన బాలరాముడు.. దర్శన వేళలు ఇవే

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)