Breaking News

ఉజ్జయిని: షాపులపై ఓనరు పేరు తప్పనిసరి

Published on Sun, 07/21/2024 - 11:12

భోపాల్‌: కన్వర్ యాత్ర  దారిలో ఉన్న షాపుల ఓనర్లు తమ పేరు స్పష్టంగా కనిపించేలా నేమ్‌ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. ఇదే దారిలో తాజాగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్జయినిలో హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. 

క్యూఆర్‌కోడ్‌, ఫోన్‌ నంబర్‌ను కూడా నేమ్‌ప్లేట్‌లో ఉంచాలని పేర్కొంది. ఈ ఆదేశాలు పాటించని వారికి రూ.2,000 నుంచి రూ.5000 వేల వరకు ఫైన్‌ వేస్తామని, వారి హోటళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు. ముస్లింలు తమ లక్ష్యం కాదని క్లారిటీ ఇచ్చారు.

నేమ్‌ప్లేట్ల వ్యవహరాన్ని విపక్షాలు మాత్రం దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాగా కన్వర్‌ యాత్ర సోమవారం (జులై 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా  శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు.

Videos

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!