Breaking News

ఢిల్లీ రోడ్లపైకి ఉబెర్‌ ఏసీ బస్సులు

Published on Thu, 07/18/2024 - 09:39

దేశరాజధాని ఢిల్లీలో త్వరలో ఉబెర్‌ బస్సులు తిరగనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం  ప్రయాణికుల కోసం ఒక వినూత్న పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కింద ఆగస్టు నుండి ఢిల్లీవాసులు ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఏర్పడనుంది.

గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసిన ‘ఢిల్లీ మోటార్ వెహికల్ లైసెన్సింగ్ అగ్రిగేటర్ (ప్రీమియం బస్సులు) పథకం’ కింద లగ్జరీ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. నగరంలో ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని అరికట్టడం ఈ పథకంలోని ‍ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో రెండు అగ్రిగేటర్లు.. ఉబెర్‌, అవేగ్‌ బస్సులను నడపడానికి లైసెన్స్‌లను మంజూరు చేసింది. ఈ బస్సులు ఏఏ మార్గాల్లో సేవలను ప్రారంభించాలనేది ఖరారు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు.

త్వరలో డిల్లీ రోడ్లపై తిరిగే ఈ ప్రీమియం బస్సులు తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. ఈ బస్సులలో వైఫై  సదుపాయం ఉంటుంది. అలాగే జీపీఎస్‌, సీసీటీవీ కూడా ఉంటుంది. ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలోగా ఈ బస్సులు ఢిల్లీ రోడ్లపై తిరగనున్నాయని సమాచారం. 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)