Breaking News

వేడి కూరలో పడి చిన్నారి దుర్మరణం

Published on Mon, 08/03/2026 - 10:05

ఛత్రపతి శంభాజీనగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్ తాలూకా పరిధిలోని ముద్దేశ్వడ్‌గావ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ, ప్రమాదవశాత్తూ వేడి కూర పాత్రలో పడి మృతి  చెందింది. మృతురాలిని రుతుజా శ్రవణ్ రాజ్‌పుత్‌గా పోలీసులు గుర్తించారు. జూలై 19న రుతుజ తన ఇంట్లో ఆడుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. చిన్నారి ఆడుకునే క్రమంలో అనుకోకుండా మరుగుతున్న వేడి కూర ఉన్న పాత్రలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలైంది. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై, చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యుల సూచన మేరకు ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి రెండు వారాల పాటు ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్యులు చికిత్స అందించారు. తీవ్ర గాయాలపాలైన రుతుజ పరిస్థితి క్రమంగా క్షీణించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్న సమయంలో తల్లిదండ్రులు  అప్రమత్తతతో ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. 

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)