Breaking News

ఈ చిన్నారి మృత్యుంజయుడు!

Published on Fri, 04/05/2024 - 06:12

విజయపుర: ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారిని 20 గంటలపాటు శ్రమించి, 16 అడుగుల లోతు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి తాలూకా లచియానా గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నపాటి గాయమైనా కాకుండానే బాలుడిని రక్షించిన సహాయక సిబ్బందిని గ్రామస్తులు ప్రశంసల్లో ముంచెత్తారు. లచ్యాణ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

గ్రామానికి చెందిన రైతు శంకరప్ప మంగళవారం తన భూమిలో బోరుబావిని తవ్వారు. నీళ్లు పడకపోవడంతో దాన్ని వదిలేసి, మరో బోరు వేశారు. బుధవారం మధ్యాహ్నం శంకరప్ప మనవడు సాతి్వక్‌ సతీశ్‌ ముజగోండ్‌ ఖాళీగా ఉన్న బోరుబావి వద్దకు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. బోరు బావి నుంచి ఏడుపు వినిపించడంతో గ్రామస్తులు సాయంత్రం 6.15 గంటల సమయంలో ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు.

పోలీసులు, ఫైర్, వైద్య, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఫైర్‌ సిబ్బంది తాడును లోపలికి వేసి, బాలుడి కాలికి గట్టిగా బిగుసుకునేలా చేశారు. బాలుడు మరింత లోతుకు జారిపోకుండా నివారించగలిగారు. పైపు సాయంతో ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. 16 అడుగుల లోతులో చిన్నారి బండరాళ్ల మధ్య చిక్కుకున్నట్లు గుర్తించారు. బండరాళ్లు అడ్డురావడంతో నిట్టనిలువుగా, అర్ధరాత్రి దాటాక 2 గంటలకల్లా 21 అడుగుల లోతు మేర గుంత తవా్వరు. 20 గంటల తర్వాత గురువారం మధ్యాహా్ననికి చిన్నారిని బయటికి తెచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు పండుగ చేసుకున్నారు.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)