Breaking News

వరుసగా మృతిచెందుతున్న పైలట్లు..  ఏం జరుగుతోంది?

Published on Thu, 08/17/2023 - 16:16

న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్  బాత్రూమ్‌లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. 

మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్‌పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్‌పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. 

ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్‌పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్‌పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు.      

ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్‌లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు.            

ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. 

Videos

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)