Breaking News

గడ్డి తినిపించారు..

Published on Tue, 06/24/2025 - 00:53

బరంపురం: పశువులను దొంగతనంగా రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు దళితులను తీవ్రంగా కొట్టి, సగం గుండు గీయించి, మోకాళ్లపై నడిపించడంతోపాటు గడ్డి తినిపించారు. ఈ దారుణం ఒడిశాలోని గంజాం జిల్లా ధారకొటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖారిగుమ్మ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. 

సింగిపూర్‌కు చెందిన బాబులా నాయక్‌(54), బులు నాయక్‌(42)లు హరియూర్‌ గ్రామం నుంచి ఒక ఆటోలో రెండు ఆవులు, ఆవుదూడను తీసుకువస్తున్నారు. వీరిని ఖారిగుమ్మ గ్రామానికి చెందిన ‘గో పరిరక్షకులు’కొందరు అడ్డుకున్నారు. వాటిని తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నానని బాబులా చెప్పగా కొట్టిపారేశారు. దొంగతనం చేశారంటూ వారిపై నెపం వేశారు. 

రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా బాధితులు తిరస్కరించారు. దీంతో, వారిని తీవ్రంగా కొడుతూ నానా దుర్భాషలాడారు. సెలూన్‌కు తీసుకెళ్లి సగం జుత్తు గొరిగించారు. కిలోమీటర్ల దూరం వారిని మోకాళ్ల మీద నడిపించారు. మురుగు కాల్వలో నీటిని తాపించారు. గడ్డి తినిపించారు. కేసు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్‌ చేశామని, పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తున్నామని ఎస్‌పీ సువేందు కుమార్‌ పాత్ర తెలిపారు. వారు గో పరిరక్షకులు కాదు, బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు మాత్రమేనని ఆయన అన్నారు.  
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)