Breaking News

Kashmir: ఇద్దరు జవాన్లు అదృశ్యం.. ఉగ్రవాదులు అపహరించారా?

Published on Wed, 10/08/2025 - 18:53

కోకెర్నాగ్: దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.  కోకెర్నాగ్-గాడోల్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపడుతున్న సమయంలో  ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది అదృశ్యమయ్యారని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. పారా కమాండోస్ యూనిట్‌కు చెందిన ఈ సైనికులు సోమవారం (అక్టోబర్ 6) ఉగ్రవాదులను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ బృందంలో సభ్యులని తెలిపారు.

ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యానికి  నిఘా సమాచారం అందిన దరిమిలా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది తమ యూనిట్‌తో సంబంధాలు కోల్పోయారని, అప్పటి నుండి వారి జాడ కనిపించడం లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో అదృశ్యమైన సైనికులను వెదికేందుకు సైన్యంతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.

దోడా- కిష్త్వార్ జిల్లాల సరిహద్దుల్లోనిపిర్ పంజాల్ పర్వత శ్రేణి వెంబడి  ఉన్న ప్రాంతంలో ఈ ఇద్దరు సైనికులు అదృశ్యమయ్యారు. ఈ ప్రాంతం దట్టమైన అడవితో కూడి ఉంటుంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో కురుస్తున్న మంచు,  భారీ వర్షాలు సెర్చ్‌ అపరేషన్‌కు సవాలుగా మారాయి. తప్పిపోయిన సిబ్బందిని ఉగ్రవాదులు అపహరించారా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)