Breaking News

Noida Dowry Case: నోయిడా వరకట్నం కేసులో బిగ్‌ ట్విస్ట్..

Published on Wed, 08/27/2025 - 15:25

ముంబై: నోయిడా అదనపు కట్నం కేసులో ట్విస్ట్‌ చేసుకుంది. అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్త విపిన్ భాటి, అత్తమామలు నిక్కీభాటిని సజీవ దహనం చేశారు. ఇప్పుడే అదే నిక్కీభాటి కుటుంబ సభ్యులు వరకట్నం కావాలని తననూ వేదించినట్లు నిక్కీభాటి వదిన మీనాక్షి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో నిక్కీభాటి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

నోయిడా వరకట్న హత్య కేసులో బాధితురాలు నిక్కీ భాటి కుటుంబంపై వదిన మీనాక్షి ఆరోపణలు చేశారు. నిక్కీభాటి సోదరుడు రోహిత్‌ పయ్లాతో  మీనాక్షి వివాహం జరిగింది. వరకట్నం కావాలని తన మాజీ భర్త రోహిత్‌తో పాటు అతని తల్లిదండ్రులు తనని వేధించారని అన్నారు. దీంతో తన కుమార్తె ప్రాణం తీసిన విపిన్‌ భాటి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాంటూ నిక్కీభాటి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో వారిపై ఆరోపణలు రావడంతో కేసును చేధించడం పోలీసులకు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.

రోహిత్‌,మీనాక్షీలకు 2016లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద మీనాక్షి కుటుంబ సభ్యులు కట్నం కింద మారుతి సియాజ్‌ను ఇచ్చారు. ఆ తర్వాత అశుభం పేరుతో దాన్ని అమ్మేశారు. బుదులు స్కార్పియో ఎస్‌యూవీ కొత్తమోడల్‌ కట్నం కింద డిమాండ్‌ చేశారు.

అందుకు తాను, తన కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పంపించారు. ఇదే విషయాన్ని పెద్దల సమక్షంలో తేల్చుకోనేందుకు గ్రామ పంచాయితీకి తీసుకెళ్లారు. అక్కడ మినాక్షి కుటుంబానికి రూ.35 లక్షలు (వారి వివాహానికి ఖర్చు చేసిన మొత్తం) తిరిగి ఇవ్వాలని, తద్వారా ఆమె తిరిగి వివాహం చేసుకోవచ్చని లేదా భర్త కుటుంబం ఆమెను తిరిగి తమ కోడలుగా అంగీకరించాలని పంచాయితీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఆమెను తిరిగి కోడలుగా స్వీకరించేందుకు నిక్కీ భాటియా తండ్రి భిఖారి సింగ్ పైలా, ఇతర కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. సమస్య పరిష్కారం నోచుకోలేదని మీనాక్షి వాపోయారు. 

మీనాక్షి ఆరోపణలపై ఆమె మాజీ భర్త నిక్కీ భాటి సోదరుడు మాట్లాడేందుకు నిరాకరించాడు. నేను ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదు.ఆమె కేవలం ఆరోపణలే చేసిందన్నారు. ఇదే విషయంపై నిక్కీ భాటి మరో కుటుంబసభ్యుడు మాట్లాడుతూ.. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య కాల్పులకు దారి తీసింది. ప్రతీ ఇంట్లో గొడవలు జరగడం సాధారణం. కానీ మేం ఆ అమ్మాయిని తగలబెట్టలేదు’ అని రోహిత్‌ కుటుంబ సభ్యులకు మద్దతు పలికారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)