Breaking News

కరూర్‌ తొక్కిసలాటకు బాధ్యులెవరు?..సీబీఐకి విజయ్‌ ఇచ్చిన సమాధానం ఇదే!

Published on Mon, 01/12/2026 - 20:58

న్యూఢిల్లీ: ‘గతేడాది జరిగిన కరూర్‌ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. కరూర్‌ తొక్కిసలాటపై విజయ్‌ సోమవారం ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆరు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన సీబీఐ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లారు.

విచారణలో కరూర్‌ తొక్కిసలాటపై విజయ్‌ సీబీఐ అధికారులకు ఏం చెప్పి ఉంటారనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో విజయ్‌ కరూర్‌ తొక్కిసలాటకు తమ పార్టీ బాధ్యత వహించబోదని సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన విజయ్‌ని.. తొక్కిసలాట ఘటనపై విచారణ అధికారులకు ఏం చెప్పారని మీడియా ప్రశ్నించింది. తొక్కిసలాట తీవ్రత తగ్గించేందుకు వేదికను విడిచివెళ్లానని తెలిపారు. ఇదే విషయాన్ని విజయ్‌ పలు పార్టీ బహిరంగ కార్యాక్రమాల్లో చెప్పుకొచ్చారు.

ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి కాలేదని, విజయ్‌ స్టేట్మెంట్‌ను వెరిఫై చేసిన తర్వాత మళ్లీ పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు సమాచారం. ‘విజయ్‌ను విచారించడం పూర్తి కాలేదు. సంక్రాంతి పండుగ కారణంగా విచారణ ప్రస్తుతానికి వాయిదా వేశాం. పండుగ తర్వాత సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామం’అని సీబీఐ విచారణ అధికారులు జాతీయ మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది.  

మరోవైపు తమిళనాడు పోలీసులు మాత్రం కరూర్‌ తొక్కిసలాటకు విజయ్‌ కారణమని ఆరోపిస్తున్నారు. సభ నిర్వహించే సమయం కంటే ఆలస్యంగా వచ్చారని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సమయం గడిచే కొద్దీ అభిమానులు,పార్టీ కార్యకర్తలు విజయ్‌ను చూసేందుకు భారీ ఎత్తున గుమిగూడారు. ఊపిరాడడక జనసందోహాన్ని కట్టడి చేసే సమయంలో ఈ ఘోర జరిగినట్లు స్పష్టం చేస్తున్నారు. సభకు వచ్చిన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆహారం, మంచినీరు,టాయిలెట్‌ సౌకర్యం కల్పించడంలో టీవీకే విఫలమైందన్నారు.  

తొక్కిసలాటపై అధికార డీఎంకే పార్టీ కుట్రకు పాల్పడిందని విజయ్‌ ఆరోపించారు. డీఎంకే మాత్రం పోలీసుల వైఫల్యం వల్లే భారీ ప్రాణ నష్టం జరిగిందని విజయ్‌ ఆరోపణల్ని ఖండించింది. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ ప్రసంగించిన భారీ రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఇది ఇటీవలి తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)