Breaking News

చైనాతో ట్రంప్‌ ఆచితూచి అడుగులు.. వాణిజ్య ఒప్పందానికి 90 రోజులు గడువు పెంపు

Published on Tue, 08/12/2025 - 07:44

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో చైనా పట్ల తమ వైఖరిని వెల్లడించేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని మరో 90 రోజులు పొడిగించారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తలెత్తబోయే సుంకాల వివాదాన్ని ట్రంప్‌ మరికొంత కాలం వాయిదా వేశారు.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో చైనాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో పొడిగింపు కోసం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశానని, అయితే ఒప్పందంలోని అన్ని ఇతర అంశాలు అలాగే ఉంటాయని తెలియజేశారు. నిజానికి ట్రంప్‌ చైనాకు ఇచ్చిన గడువు మంగళవారం (ఆగస్టు 12) మధ్యాహ్నం 12:01 గంటలకు ముగియనుంది. ఒకవేళ ట్రంప్‌ గడువు ఇవ్వకుంటే అమెరికా.. చైనా దిగుమతులపై 30శాతం అధిక పన్నులను పెంచివుండేది.  
 

సుంకాల ఒప్పందం విషయంలో కుదిరిన విరామం రెండు దేశాలు పరస్పరం చర్చించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. అలాగే ఈ సంవత్సరం చివర్లో ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగే  శిఖరాగ్ర సమావేశానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికా-చైనా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు సీన్ స్టెయిన్ మాట్లాడుతూ ఈ పొడిగింపు రెండు ప్రభుత్వాలకు వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరపడానికి  ఉపయోగపడుతుందన్నారు. ఈ విరామం చైనాలో తమ మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరుస్తుందని, కంపెనీలు మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైన ఖచ్చితత్వాన్ని అందిస్తుందని  పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్ తదితర వాణిజ్య భాగస్వాములు ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించాయి. యేల్ విశ్వవిద్యాలయంలోని బడ్జెట్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం సగటు యూఎస్‌ సుంకం ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 2.5 శాతం నుండి 18.6 శాతానికి పెరిగింది. ఇది 1933 తర్వాత అత్యధికం.
 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)