Breaking News

త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి కన్నుమూత.. సీఎం సంతాపం

Published on Sun, 01/01/2023 - 20:10

అగర్తలా: త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి, ఇండీజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) చీఫ్‌ నరేంద్ర చంద్ర దేవవర్మ(84) కన్నుమూశారు. రాష్ట్ర రాజధాని అగర్తలలోని గోవింద్‌ వల్లభ పంత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో గత శుక్రవారం ఆసుపత్రిలో చేరారు దేవవర్మ. మెదడులోని నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత ఐసీయూకి మార్చి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. 

‘రాష్ట్ర కేబినెట్‌ సీనియర్‌ సభ్యులు ఎన్‌.సీ.దేవవర్మ మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నా. ఓం శాంతి!’ అని ట్విట్టర్‌ వేదికగా నివాళులర్పించారు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్‌ మానిక్‌ సాహా. మరోవైపు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేవ్‌.   

ప్రస‍్తుతం బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది దేవవర్మ పార్టీ ఐపీఎఫ్‌టీ. 2018లో ఐపీఎఫ్‌టీతో జతకట్టి అప్పటి లెఫ్ట్‌ ఫ్రంట్‌ను అధికారంలో నుంచి దించింది బీజేపీ. 1997లో ఐపీఎఫ్‌టీ ఏర్పడినప్పటికీ 2001లో విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత 2009లో దేవవర్మ నేతృత్వంలో మళ్లీ పార్టీ పుంజుకుంది. త్రిపురతో పాటు ఢిల్లీలోనూ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు దేవవర్మ.

ఇదీ చదవండి: షాకింగ్‌: యువతిని కారుతో 4 కిమీ ఈడ్చుకెళ్లి.. నగ్నంగా వదిలేసి!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)