Breaking News

త్రిపురను ముంచెత్తిన వరదలు.. రూ. 15 వేల కోట్ల నష్టం

Published on Sun, 08/25/2024 - 12:07

త్రిపురను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలో వరదల కారణంగా రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాకు తెలిపారు. వరదల కారణంగా 24 మంది మృతిచెందినట్లు తెలిపారు. 1.28 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు.

అఖిలపక్ష సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా ఏర్పడిన నష్టం రూ.15 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. క్లిష్ట సమయాల్లో కలిసికట్టుగా పని చేస్తామని అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు సరిపడా ఆహార ధాన్యాలు, ఇంధనం నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మార్కెట్లపై నిఘా సారిస్తుందని అన్నారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం త్రిపురలో వరద పరిస్థితులు నెమ్మదించాయి. పలు నదులు ప్రమాద స్థాయికి దిగువన ప్రవహిస్తున్నాయి. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారి కోసం వైమానిక దళం హెలికాప్టర్ల నుండి నాలుగు వేలకు పైగా ఆహార ప్యాకెట్లను జారవిడిచింది. ఇదిలావుండగా బంగ్లాదేశ్‌లో వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరుకుంది. ఆ దేశంలోని 11 జిల్లాల్లో వరదలకు దాదాపు 49 లక్షల మంది  ప్రభావితులయ్యారు. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ తమ దేశానికి సహాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలను కోరుతున్నారు. 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)