Breaking News

టీఎంసీ ముస్లిం ఓటు బ్యాంక్‌ ఖతం! 

Published on Mon, 12/08/2025 - 01:34

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ముర్షిదాబాద్‌ ఎమ్మెల్యే హుమాయూన్‌ కబీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగోసారి మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠం ఎక్కనివ్వబోనని ప్రతినబూనారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌కున్న ముస్లిం ఓటు బ్యాంకు ఇక గల్లంతేనని స్పష్టం చేశారు. అసలు కథ ముందుందంటూ హెచ్చరికలు చేశారు. 

ముందుగా ప్రకటించిన విధంగానే శనివారం బెల్డంగలో బాబ్రీ తరహా మసీదుకు పునాది రాయి వేయడం తెల్సిందే. పోలీసులు ఈ కార్యక్రమానికి సహకారం అందించకున్నా 8 లక్షల మంది తరలివచ్చారన్నారు. విరాళాలు ఇటుకలు, డబ్బు రూపంలో వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఈ నెల 22న సొంతపార్టీ ఏర్పాటును ప్రకటిస్తానని, ముస్లింల సంక్షేమం కోసం పనిచేసే తమ పార్టీ అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోని 294 స్థానాలకు గాను 135 చోట్ల బరిలో ఉంటారన్నారు. 

ఎంఐఎం నేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో మాట్లాడి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలను తాము మలుపు తిప్పబోతున్నట్లు చెప్పారు. టీఎంసీయే కాదు, బీజేపీకి కూడా రాష్ట్రంలో అధికారం దక్కనివ్వబోమని తేలి్చచెప్పారు. అదేవిధంగా, మసీదు నిర్మాణానికి పునాది రాయి వేసిన బెల్డంగలోని రెజినగర్‌లో ఫిబ్రవరిలో లక్ష మందితో ఖురాన్‌ పఠనం చేపడతామన్నారు. పఠనం అనంతరం మసీదు నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు. హాజరైన వారికి బిర్యానీతో విందు ఉంటుందని వివరించారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)