Breaking News

8 నెలల్లో 834 బాల గర్భిణులు.. షాకింగ్‌ నిజాలివే..

Published on Mon, 01/12/2026 - 11:53

తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టినప్పటికీ, బాల గర్భిణుల సంఖ్య పెరుగుతుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. 2025 ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో జిల్లాలో 834 మంది బాలికలు గర్భం ధరించినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ సంఖ్య వెయ్యి మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

టీనేజ్ గర్భం అంటే..
జిల్లాలో సగటున నెలకు 100 కేసులు, అంటే రోజుకు మూడు నుండి నాలుగు కేసులు నమోదవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-2025)లో ఈ సంఖ్య 1,234 గా ఉండటం చూస్తుంటే, పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం అవుతుంది. 13 నుంచి 19 ఏళ్ల లోపు వయసులో గర్భం దాల్చడాన్ని టీనేజ్ గర్భంగా పరిగణిస్తారు. చట్టబద్ధంగా 19 ఏళ్ల వయసు దాటాక గర్భం దాల్చేందుకు అనుమతి ఉంటుంది. 2025, ఏప్రిల్‌లో వెలువడిన ‘తమిళనాడు జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్’ నివేదిక ప్రకారం, 10-19 ఏళ్ల లోపు తల్లులు ఫిట్స్, ఇన్ఫెక్షన్లు, ప్రసవానంతర సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా పుట్టబోయే బిడ్డలు తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండానే జన్మించడం లాంటి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

బలవంతపు వివాహాలు
ఈ ఆందోళనకర ధోరణికి బాల్య వివాహాలే ప్రధాన కారణమని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. కుటుంబ, సామాజిక ఒత్తిళ్లు, లైంగిక వేధింపులు, విద్యకు దూరం కావడం, ఆరోగ్య విషయాలపై అవగాహన లేకపోవడం  మొదలైనవి ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. తమ పిల్లలు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారని తెలియగానే.. తల్లిదండ్రులు వారికి బలవంతంగా వివాహం జరిపించడం లేదా చదువుపై ఆసక్తి లేక బాలికలే పెళ్లికి మొగ్గు చూపడం లాంటి ఉదంతాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి.

ప్రతీ కేసుపై దర్యాప్తు
గ్రామ స్థాయి శిశు సంరక్షణ కమిటీల (వీఎల్‌సీపీసీ) పర్యవేక్షణ లోపించడం కూడా ఈ సమస్యకు ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం బాల్యవివాహాలపై సదస్సులు నిర్వహించడమే కాకుండా, ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని మాతాశిశు హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. కాగా తిరుచ్చి జిల్లా యంత్రాంగం ఈ విషయంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని, నమోదైన ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ‘హిందీని రుద్దితే..’ రాజ్ ఠాక్రే తీవ్ర హెచ్చరిక

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)