రోడ్డు ప్రమాదంతో మహిళకు అబార్షన్‌

Published on Sat, 09/06/2025 - 08:56

న్యూఢిల్లీ: 2018లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కారణంగా అబార్షన్‌ అయిన మహిళ(41)కు పరిహారంగా రూ.40.91 లక్షల పరిహారం చెల్లించాలని మోటారు వాహన ప్రమాదాల ట్రిబ్యునల్‌ తీర్పు వెలువరించింది. ఓ వ్యక్తి అజాగ్రత్తతో వేగంగా వాహనం నడిపి తనను ఢీకొట్టాడని అన్షు కశ్యప్‌ అనే మహిళా టీచర్‌ ఫిర్యాదు చేశారు. ఈమె అప్పటికే మరుగుజ్జుతనం కారణంగా 40 శాతం వైక్యలంతో ఉన్నారు. ప్రమాదం వల్ల ఆరు నెలల గర్భ విచ్ఛిత్తి జరగడంతోపాటు తన వైకల్యం శాతం 84 శాతానికి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

విధులు నిర్వహించలేని స్థితికి చేరుకున్నానన్నారు. కేసును పరిశీలించిన ప్రిసైడింగ్‌ అధికారి షెల్లీ అరోరా..‘ఆమె వయస్సు, శారీరక వైకల్య తీవ్రత, మరోసారి గర్భం దాల్చేందుకు తక్కువగా ఉండే అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆమె ప్రస్తుతం సొంతంగా ఎక్కడికీ వెళ్లలేని స్థితిలోకి చేరుకున్నారని వివరించారు. ఆమెకు అన్ని విధాలుగా కలిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటూ రూ.40.91 లక్షలు పరిహారంగా ఇవ్వాలని వాహన బీమా కంపెనీ అయిన ఇఫ్కో టోకియో జనరల్‌ ఇన్సూరెన్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. 
 

#

Tags : 1

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)