Breaking News

విరాళం ఇవ్వలేదని దారుణం..

Published on Wed, 11/18/2020 - 19:53

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో పద్నాలుగు గిరిజన కుటుంబాలు దుర్గా పూజ ఉత్సవాలకు తగినంత విరాళం ఇవ్వనందున సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశాయి. సహాయం కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. న్యాయం కోసం బాలాఘాట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈ ఘటన మోటెగాన్ గ్రామంలో చోటుచేసుకుంది. దీని గురించి గ్రామస్తుడు మున్సింగ్‌ మస్రం మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేక గత నెలలో గ్రామంలో నిర్వహించిన దుర్గా పూజ  వేడుకులకు చందా  రూ.151  కంటే ఎక్కువ చెల్లించలేకపోయాం. అందువలన గ్రామ పెద్ద సామాజికంగా బహిష్కరించాలని గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చారు. అలాగే పశువులను మేపడానికి , వైద్య ,ఆరోగ్య సేవలను కూడా నిరాకరించారు’’ అని ఆరోపించాడు.  

ఇక.. ‘‘కరోనా మహమ్మారి వలన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది, ఇప్పటికి ఆ సమస్యనుంచి బయటపడలేదు. అందుకే  చందా చెల్లించలేక పోయాం, మేము ఈ విషయాన్ని లామ్టా పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశాం. తరువాత పోలీసులు ఏకాభిప్రాయంతో మా సమస్యను పరిష్కరించాలని చూశారు కానీ  అది జరగలేదు’’ అని మరో బాధితుడు  ధన్సింగ్‌  పార్టే తెలిపారు. కాగా గిరిజన కుటుంబాల  సామాజిక బహిష్కరణను విధించడంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి డాక్టర్ నరోత్తం మిశ్రా స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. "సబ్ డివిజనల్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి గ్రామస్తులను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారని, ఒకవేళ గిరిజనులపై బహిష్కరణ ఉపసంహరించకపోతే  చట్టపరమైన చర్యలు  తీసుకుంటాం’’ అని మీడియాతో అన్నారు.నిక ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌, అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేసింది. రైతులు, గిరిజనులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన సభలో చర్చించడానికి తాము ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం అతి తక్కువ సమయంలో సమావేశాలు ముగించడానికి ప్రయత్నిస్తోందని మండిపడింది. బీజేపీ ఎప్పుడు ప్రజలకు దూరంగానే ఉంటుందని మాజీ మంత్రి సజ్జార్‌ సింగ్‌ వర్మ విమర్శించారు. కాగా కొన్ని రోజుల క్రితం 28 ఏళ్ల గిరిజన యువకుడు వాయిదా కట్టలేక సజీవ దహనమైన విషయం విదితమే. అయితే కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం అతను నిర్భంధ కూలి అని 5000 రూపాయలు చెల్లించక పోవడంతో హత్య చేశారని ఆరోపించారు.

Videos

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)