Breaking News

ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు

Published on Wed, 11/29/2023 - 08:40

ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ కార్మికులలో యూపీలోని మీర్జాపూర్ నివాసి అఖిలేష్ కుమార్ ఒకరు. ఈయన బయటకు వస్తున్నాడని తెలియగానే అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ గత 17 రోజులుగా పలు ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు.

ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం కార్మికులందరినీ సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. కార్మికులంతా బయటకు వస్తున్నారని తెలియగానే అఖిలేష్ కుటుంబం సంతోషంలో మునిగితేలింది. ఈ సందర్భంగా అఖిలేష్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు.. మేము పగలు, రాత్రి దేవుణ్ణి ప్రార్థించాం. భగవంతుడా నా కుమారుడు బయటపడేలా చూడు అని వేడుకున్నాం’ అని తెలిపారు. కాగా ఆమె తన కుమారుడు సొరంగం నుంచి బయటపడిన సంతోషంలో ఇంటి చుట్టుపక్కల వారికి స్వీట్లు పంచారు. తన కుమారునికి పునర్జన్మ లభించిందని ఆమె కనిపించిన అందరికీ చెబుతున్నారు. 

ఈరోజు ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొందని అఖిలేష్‌ తండ్రి మీడియాకు తెలిపారు. ‘గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు కరుణించి  మా పిల్లలను బయటకు పంపించాడు. ఈ ప్రమాదం కారణంగా మా ఇంటిలో దీపావళి బోసిపోయింది. ఇప్పుడు మేము ఇంటిలో దీపావళి చేసుకుంటాం. క్రాకర్లు పేల్చి, స్వీట్లు పంచుకుంటాం’ అని ఆనందంగా తెలిపారు. 

మంగళవారం సాయంత్రం 7.50 గంటల ప్రాంతంలో మొదటి కార్మికుడిని సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత కార్మికులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కార్మికులందరూ పూర్తి ఆరోగ్యంతొ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ కార్యకలాపాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి బికె సింగ్  పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కార్మికులతో ఫోన్‌లో సంభాషించారు.
ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్‌ సంస్థ

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)