పని సంస్కృతిలో సాంకేతికత, అవసరాలు భాగం కావాలి: అమిత్‌ షా

Published on Mon, 07/07/2025 - 05:18

ఆనంద్‌: సహకార రంగం విజయవంతం కావాలంటే పారదర్శకత, సాంకేతికత వినియోగం, సభ్యుల అవసరాలను పని సంస్కృతిలో భాగంగా మార్చుకోవడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి అమిత్‌ షా చెప్పారు. ప్రఖ్యాత అమూల్‌ డెయిరీ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంస్థలు ఈ మూడు సూత్రాలను తమ పని సంస్కృతిలో విడదీయరాని భాగాలుగా చేసుకుని జమ్మూ కశీ్మర్‌ నుంచి అస్సాం వరకు, దేశంలోని ప్రతి గ్రామానికి వాటిని ప్రచారం చేయాలని సూచించారు. 

ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో 2 లక్షల ప్రాథమిక సహకారం పరపతి సంఘాలు(పీఏసీఎస్‌లు), మొట్టమొదటి జాతీయ సహకార యూనివర్సిటీ త్రిభువన్, డెయిరీ రంగంలో మూడు జాతీయ సహకార సంఘాలు ఏర్పాటు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైన నాలుగేళ్లలోని 60కి పైగా కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించామన్నారు. అమూల్‌ పాల సహకార వ్యవస్థ వార్షిక టర్నోవర్‌ ప్రస్తుతమున్న రూ.80వేల కోట్ల నుంచి వచ్చే ఏడాదికల్లా రూ.లక్ష కోట్లకు చేరుకోనుందని అమిత్‌ షా ప్రకటించారు. గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ సమాఖ్యకే అమూల్‌ అని పేరు. ఈ సంస్థ నిత్యం 36 లక్షల రైతుల నుంచి 3.20 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తుంది.   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)