Breaking News

అయోధ్య: ‘డబ్బులు తీసుకోకుండా ఆశీర్వదిస్తాం’

Published on Mon, 01/15/2024 - 17:22

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి  ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ట్రాన్స్‌జెండర్ల కమ్మూనిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ట్రాన్స్‌జెండర్లు జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని ఆ పవిత్రమైన రోజు జన్మించే పిల్లల తల్లిదండ్రుల వద్ద ఎటువంటి  డబ్బులు, కానుకలు తీసుకోకుండా ఆశీర్వాచనం అందజేస్తామని తెలిపింది.

తాము చిన్న పిల్లలు జన్మించిన ఇళ్లకు వెళ్లి పాటలు పాడి.. పుట్టిన చిన్నపిల్లలు సంతోషంగా పెరగాలని ఆశీర్వదిస్తామని ట్రాన్స్‌ కమ్మూనిటీకి చెందిన ప్రతినిధి రాణీ తెలిపారు. అయితే జనవరి 22 రాముడి ప్రాణప్రతిష్ట రోజున జన్మించే చిన్నారుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు, కానుకలను తీసుకోకుండానే ఉచితంగా ఆశీర్వచనం ఇస్తామని తెలిపారు.

రాముడి ప్రణప్రతిష్ట రోజు పిల్లల తల్లిదండ్రులు తమకు డబ్బుల బదులుగా సంతోషంగా పండ్లు ఇ‍చ్చినా తీసుకుంటామని మరో ట్రాన్‌జెండర్‌ శరదా తెలిపారు. రాముడిని దర్శించుంచుకునే అవకాశం రావటం తమ జీవితాల్లో ఎంతో అదృష్టమని తెలిపారు. 500 ఏళ్ల నుంచి జరిగిన పోరాటం.. జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టతో కార్యరూపం దాల్చుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు.. జనవరి 22న పవిత్రమైన రోజుగా భావిస్తూ.. అయోధ్యతో పాటు పలు రాష్ట్రాలు ‘డ్రై డే’గా ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకి రాడంట!

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు