పాట్నా సివిల్‌ కోర్టు వద్ద పేలుడు..

Published on Wed, 03/13/2024 - 17:26

పాట్నా: బిహార్‌లోని  పాట్నా సివిల్‌ కోర్టు వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు లాయర్‌ కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఆ ఘటన వెలుగుచూసింది. సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ వద్ద ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు.  ఈ క్మంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫర్మర్‌ పేలుడు సంభవించడంతో భారీగా మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నంబర్ వన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్‌గా గుర్తించారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.ప్రమాదంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి న్యాయవాదులను శాంతింప జేశారు. ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
చదవండి: ‘సోదరుడిపై సీఎం మమత ఫైర్‌.. అన్ని బంధాలు తెంచుకున్నా’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)