Breaking News

పూజా ఖేద్కర్‌ కేసు.. ఆడీ కారు సీజ్‌ చేసిన పోలీసులు

Published on Sun, 07/14/2024 - 16:11

ముంబై: అధికార  దుర్వినియోగం, యూపీఎస్పీకి తప్పుడు అఫిడవిట్‌  సమర్చించారనే ఆరోపణలతో ఇటీవల ట్రైనీ ఐఏఎస్‌ పూజా మనోరమ దిలీప్‌ ఖేద్కర్ వివాదాస్పదం అయ్యారు. ఇక, ఆమె వ్యవహారంపై  ఏక సభ్య కమిటీ విచారణ జరుపుతోంది. అయితే తాజాగా  ఆమెకు చెందిన లగ్జరీ  ఆడీ కారును ఆదివారం పుణె పోలీసులు సీజ్‌ చేశారు. 

పూజా ఖేద్కర్‌ ఉపయోగించిన లగ్జరీ ఆడీ కారు తన పేరుమీద కాకుండా ఓ ప్రైవేట్‌ కంపెనీ యజమానిపై ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పుణె రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు సదరు కంపెనీ ఓనర్‌కు నోటీసు జారీ చేసింది. అనంతరం ఆ కారును చతుర్‌శృంగి పోలీసులు తీసుకువెళ్లి.. పోలీసు స్టేషన్‌లో బారికేడ్ల మధ్య పెట్టారు. అయితే తాజాగా ఆమె ఆడి కారును పుణె పోలీసులు సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

చదవండి:  పూజా ఖేద్కర్ ఎపిసోడ్‌: ‘నా కూతురు ఏ తప్పూ చేయలేదు’

ఇక.. ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్‌ తాను వినియోగించే ఆడీ కారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం, గవర్నమెంట్‌ ఆఫ్‌ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పైఅధికారులు లేని సమయంలో వారి ఛాంబర్‌లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్‌ చాటింగ్‌ వెలుగులోకి వచ్చింది.

చదవండి:  పూజా ఖేద్కర్‌పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..

ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్‌ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి. 

దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్‌ మెంబర్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ పేర్కొంది.

చదవండి: Pooja khedkar: కూతురే కాదు త‌ల్లి కూడా అదే దందా.. వీడియో వైర‌ల్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)