Breaking News

ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి

Published on Fri, 09/13/2024 - 05:33

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. యువ సైనికాధికారులను తీవ్రంగా కొట్టి, వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇండోర్‌ సమీపంలోని మోవ్‌ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు అధికారులు, తమ స్నేహితురాళ్లతో కలిసి బుధవారం మధ్యాహ్నం చోటీ జామ్‌ వద్ద ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలోని ప్రదేశానికి పిక్నిక్‌కు వెళ్లారు.

తుపాకులు, కత్తులు, కర్రలతో వచ్చిన 8 మంది దుండగులు అకస్మాత్తుగా వారిని చుట్టుముట్టారు. నలుగురినీ చితకబాది వారివద్ద డబ్బు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఒక అధికారిని, అతడి స్నేహితురాలిని బందీలుగా ఉంచుకున్న దుండగులు రూ.10 లక్షలు తెస్తేనే విడిచిపెడతామంటూ మరో అధికారి, అతడి స్నేహితురాలిని పంపించారు. బాధితుడు హుటాహుటిన తన యూనిట్‌కు వెళ్లి కమాండింగ్‌ అధికారికి సమాచారమిచ్చారు. 

ఈ మేరకు పోలీసులు, మిలటరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిని చూసి దుండగులు పారిపోయారు. నలుగురు బాధితులను పోలీసులు మోవ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. దోపిడీ, అత్యాచారం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మోవ్‌ ఘటనపై కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో శాంతి భద్రతలు మచ్చుకైనా కానరావడం లేదని దుయ్య బట్టారు. మహిళలపై జరుగుతున్న నేరాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకర అంశమని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)