Breaking News

వంతెన మధ్యలో మొరాయించిన రైలు.. ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లు

Published on Sat, 06/22/2024 - 08:04

ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు అందరినీ బెంబెలెత్తిస్తున్నాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒక్కసారి ఆ రైలు నడుపుతున్న పైలట్లు తెగువ చూపి, ప్రమాదాన్ని నివారిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఉదంతం బీహార్‌లో చోటుచేసుకుంది.

బీహార్‌లోని సమస్తీపూర్‌లో  రైలు ప్రమాదాన్ని  నివారించిన లోకో పైలట్లను అందరూ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సమస్తీపూర్ రైల్వే సెక్షన్‌లోని వాల్మీకినగర్‌-పనియవా స్టేషన్ల మధ్యగల వంతెనపై రైలు  ఉన్నట్టుండి ఆగిపోయింది. వంతెనపై రైలు అలా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే రైలులోని  ఏదో వాల్వ్‌ నుంచి  ఎయిర్‌ ప్రజర్‌ లీక్‌ అవడాన్ని లోకో పైలట్లు గమనించారు. అందుకే రైలు అలా ఆగిపోయిందని గుర్తించారు.

బయటి నుంచి సాంకేతిక సాయం అందించడానికి వీలులేని చోట రైలు ఆగింది. దీంతో రైలును నడుపుతున్న ఇద్దరు లోకో పైలట్‌లూ  ఇంజిన్‌లోని లీకేజీని సరిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వారు రైలు కిందుగా పాకుకుంటూ లీకేజీ అవుతున్న చోటుకువెళ్లి మరమ్మతులు చేశారు.

ఈ ఘటన గురించి రైల్వే అధికారులు మాట్లాడుతూ నార్కతియాగంజ్ - గోరఖ్‌పూర్ ప్యాసింజర్ రైలు వాల్మీకినగర్- పనియావాన్ మధ్య గల వంతెనపైకి చేరుకోగానే ఇంజిన్ (లోకో)కు చెందిన అన్‌లోడర్ వాల్వ్ నుండి అకస్మాత్తుగా  ఎయిర్‌ ప్రజర్‌ రావడం మొదలైంది. ఫలితంగా ఎంఆర్‌ ఒత్తిడి తగ్గింది. దీంతోట్రాక్షన్ ఆగిపోయి, రైలు వంతెనపై నిలిచిపోయింది. రైలు బ్రిడ్జి మధ్యలో ఆగడంతో దాన్ని సరిచేసే మార్గం కనిపించలేదు. అయితే రైలు నడుపుతున్న పైలట్లు ఎంతో తెగువ చూపి, దానికి మరమ్మతులు చేసి, రైలు ముందుకు కదిలేలా చేశారు.

ఈ సందర్భంగా సమస్తీపూర్‌ డీఆర్‌ఎం మాట్లాడుతూ లోకో పైలట్లు అజయ్ కుమార్ యాదవ్, జీత్ కుమార్ ఎంతో తెగువచూపి వంతెనపై ఆగిపోయిన రైలు ముందుకు కదిలేలా చేశారని, వీరికి రైల్వేశాఖ రూ.10 వేల నగదు అందించడంతోపాటు  ప్రశంసా పత్రం ఇవ్వనున్నదని తెలిపారు. 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)