Breaking News

Gujarat: రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర... తప్పిన ముప్పు

Published on Sat, 09/21/2024 - 10:04

సూరత్‌: గుజరాత్‌లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ఇది భగ్నం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సూరత్ సమీపంలోని వడోదర డివిజన్ పరిధిలోగల అప్ లైన్ రైల్వే ట్రాక్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. ట్రాక్‌లోని ఫిష్‌ ప్లేట్‌, కీని తెరిచివుంచారు. దీని వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

దీనిని గుర్తించిన పశ్చిమ రైల్వే (వడోదర డివిజన్)అధికారులు కొద్దిసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో తనిఖీలు, మరమ్మతులు చేసిన దరిమిలా రైలు సేవలను పునరుద్ధరించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రైల్వే ప్రమాదాలకు కారణమయ్యే ఏ కుట్రనైనా భగ్నం చేస్తామని, దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్ భద్రత కోసం ప్రభుత్వం త్వరలో నూతన ప్రణాళికను తీసుకువస్తుందని అన్నారు.

రైల్వే భద్రతపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించినట్లు అమిత్‌షా తెలిపారు. రైల్వే నెట్‌వర్క్ భద్రత కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), రైల్వే పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, తద్వారా  కుట్రలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కాగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే 38 రైల్వే ప్రమాదాలు జరిగాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ప్రమాదాలను మంత్రి వైష్ణవ్ చిన్న ఘటనలుగా కొట్టిపారేస్తున్నారని ఆరోపించింది.


ఇది కూడా చదవండి: Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్‌ బంద్‌

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)