చెన్నై శివారులో ఘోర రైలు ప్రమాదం.. 19 మందికి గాయాలు

Published on Fri, 10/11/2024 - 21:36

సాక్షి, చెన్నై: చెన్నై వైపు వస్తున్న మైసూరు–దర్భంగా   భాగమతి ఎక్స్‌ప్రెస్‌ తిరువళ్లూరు జిల్లా కవరపేట స్టేషన్‌ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొంది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పాక్షికంగా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. 

కర్ణాటక రాష్ట్రం మైసూర్‌ నుంచి చెన్నై శివారులోని అరక్కోణం, పెరంబూరు, గుమ్మిడిపూండి మార్గం మీదుగా బిహార్‌ వైపు ప్రయాణించే దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది. ఈ రైలు రాత్రి 8.30 గంటల సమయంలో పొన్నేరి రైల్వేస్టేషన్‌ దాటి గుమ్మడిపూండి సమీపంలోని కవరపేట వద్ద భారీ కుదుపులకు లోనై లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది. ప్రమాదం జరిగిన క్షణాలలో మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. మొత్తం 13 బోగీలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. 

	Tiruvallur: సహాయక చర్యలు ముమ్మరం
 

 ప్రమాదం జరిగిన పరిసరాలు చిమ్మచీకటిగా ఉండడంతో రైలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనతో భీతావహులయ్యారు. ప్రమాద సమాచారంతో గుమ్మిడిపూండి ఎమ్మెల్యే గోవిందరాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి ప్రజలతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తిరువళ్లూరు కలెక్టర్‌ ప్రభుశంకర్,ఎస్పీ శ్రీనివాస పెరుమాల్, రైల్వే పోలీసు ఉన్నతాధికారి ఈశ్వరన్‌ నేతృత్వంలో బృందం సహాయక చర్యలకు పూనుకుంది. అప్పటికే గ్రామస్తులు రైలు బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అరక్కోణం నుంచి వచి్చన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా కట్టడి చేశారు. ›ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చెన్నైకు తరలించారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.   

సిగ్నల్‌ సమస్యే కారణమా? 
రైలు 109 కిలోమీటర్ల వేగంతో వెళుతూ భారీ కుదుపులకు లోనై లూప్‌ లైన్‌లోకి మళ్లింది. గార్డ్‌ సకాలంలో స్పందించి వేగాన్ని క్రమంగా 90 కి.మీ.కి తగ్గించారు. అప్పటికే ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది. ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఏసీ బోగీలలో స్వల్పంగా మంటలు చెలరేగినా సకాలంలో ఆర్పి వేయడంతో ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. 

ఘటన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ వైపు చెన్నై నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు మధ్యలోనే ఆగాయి. అలాగే, గుమ్మిడిపూండి మీదుగా చెన్నైకు రావాల్సిన రైళ్లు ఎక్కడికక్కడ ఆగడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. దక్షిణ రైల్వే యంత్రాంగం 044 25354151, 2435499, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ హెల్ప్‌ లైన్‌ 0866–2571244 నంబర్‌ను ప్రకటించింది. తిరుచి్చ–హౌరా, ఎర్నాకులం–టాటా నగర్, కాకినాడ–దర్బంగా భాగమతి ప్రత్యేక రైలు సేవలను గూడురు మార్గంలో నిలుపుదల చేశారు. వీటిని ప్రత్యామ్నయ మార్గంలో నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. 

చదవండి: Trichy: ఎయిరిండియా విమానం.. సేఫ్‌ ల్యాండింగ్‌

 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)