Breaking News

అయినవారి మృతదేహాల కోసం...

Published on Thu, 06/08/2023 - 12:18

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 6 రోజులు గడిచింది. బాధితులు ఇంకా తమవారి మృతదేహాల కోసం వెదుకులాట సాగిస్తూనే ఉన్నారు. ఇంకా 100 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాలేదు. దీంతో బాధితులు భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ వద్ద పడరాని పాట్లు పడుతున్నారు. పలు మృతదేహాలను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో అధికారులు వాటికి డీఎన్‌ఏ పరీక్షలు చేయించాల్సివస్తోంది. ఇందుకోసం డీఎన్‌ఏ శాంపిల్స్‌ను భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ వద్ద సేకరిస్తున్నారు. ఎయిమ్స్‌తోపాటు మరో ఐదు కేంద్రాలలోనూ డీఎన్‌ఏ శాంపిల్స్‌ సేకరణ జరుగుతోంది.

మీడియాతో ఒక బాధితుడు మాట్లాడుతూ తన కుమారుని మృతదేహాన్ని గుర్తుపట్టినప్పటికీ తమకు దానిని అప్పటించడం లేదని ఆరోపించారు. డీఎన్‌ఏ రిపోర్టు వచ్చాకనే ఇస్తామంటున్నారని తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం తిండికి కూడా ఖర్చులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు చాలామంది బాధితులు తమ వారి డీఎన్‌ఏ రిపోర్టులు వచ్చాకనే మృతదేహాలను తీసుకు వెళుతున్నారు. మరికొందరైతే ఇక్కడి పరిస్థితులను చూసి, తమవారి మృతదేహాలు దొరుకుతాయనే ఆశను కూడా వదులుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఒక బాధితుడు ఇప్పటివరకూ తన సోదరుని మృతదేహం లభ్యం కాలేదని, ఇక ఆశ వదులుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్నానన్నాడు. ఇక్కడ వెదుకులాట సాగిస్తూ మూడు రోజులయ్యింది. అధికారులు డీఎన్‌ఏ ఇచ్చి వెళ్లిపొమ్మంటున్నారని తెలిపాడు. కాగా ఇప్పటి వరకూ 30 డీఎన్‌ఏ శాంపిల్స్‌ సేకరించారు. ఈ శాంపిల్స్‌ను ప్రభుత్వం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మృతదేహాలను కోల్డ్‌ రూమ్‌లలో ఉంచారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ప్రమాదంలో మొత్తం 288 మంది మృతి చెందారు. 193 మృతదేహాలను, భువనేశ్వర్‌ తరలించారు. 94 మృతదేహాలను బాలాసోర్‌లో ఉంచారు. ఒక బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భువనేశ్వర్‌ తరలించిన 193 మృతదేహాలలో 110 మృతదేహాలకు శవ పంచనామా పూర్తయ్యింది. ఇంకా 83 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. 200 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 1000 మంది గాయపడ్డారు.

చదవండి: పశ్చిమ బెంగాల్‌ యువకుని మృతదేహం బీహార్‌కు..

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు