నేపాల్‌లో హోటల్‌కు నిప్పు.. భవనంపై నుంచి దూకేసిన భారతీయ జంట

Published on Fri, 09/12/2025 - 11:08

ఖాట్మండు: నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపు తప్పాయి. ఆగ్రహంతో రగిలిపోయిన యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ దేశాన్ని చుట్టుముట్టిన నిరసనల క్రమంలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల సమయంలో రాజధాని ఖాట్మండులోని ఓ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఓ భారతీయ జంట.. మంటల నుంచి తప్పించుకునేందుకు నాలుగో అంతస్తు విండో నుంచి దూకారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

మృతి చెందిన మహిళను డెహ్రాడూన్‌ చెందిన 55 ఏళ్ల రాజేష్ దేవి గోలాగా గుర్తించారు. పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఆమె తన భర్త రామ్‌వీర్ సింగ్ గోలాతో కలిసి ఖాట్మండుకు వెళ్లారు. రామ్‌వీర్ వృత్తిరీత్యా ట్రాన్స్‌పోర్టర్. గురువారం ఈ దంపతులు హిల్టన్ హోటల్‌లో బస చేశారు. నిరసనకారులు ఆ భవనానికి నిప్పంటించడంతో తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకారు. మరోవైపు నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తిరుగు ప్రయాణపర్వం మొదలైంది. పలు మార్గాల్లో పలు రాష్ట్రాల ప్రజలు వెనుతిరిగి వస్తున్నారు.   

కాగా, నేపాల్‌లో ఓవైపు ఉద్యమం, మరోవైపు ప్రభుత్వం కుప్పకూలడంతో శాంతిభద్రతలు కట్టుతప్పి ఖైదీలు చెలరేగిపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 కారాగారాల నుంచి 15 వేల మంది ఖైదీలు జైలు గదులు బద్దలుకొట్టిమరీ బయటపడ్డారు. పరారై బయటికొచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చారు. నేరస్తుల పరారీతో అప్రమత్తమైన సైన్యం పలుచోట్ల ఖైదీలను వెంటబడిమరీ పట్టుకుంది. కొన్ని చోట్ల జైలు సిబ్బందిపై ఖైదీలు ఎదురుతిరిగారు. మాధేశ్‌ ప్రావిన్సులోని రామెఛాప్‌ జిల్లా కారాగార కేంద్రంలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఖైదీలు జైలుసిబ్బందితో ఘర్షణకు దిగారు.

జైలు గోడను బద్దలుకొట్టేందుకు ఖైదీలు గ్యాస్‌ సిలిండర్‌ను పేల్చేశారు. దీంతో ఘర్షణ మొదలైంది. పారిపోయేందుకు ప్రయతి్నంచిన వారిని నిలువరించేందుకు సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో సోమవారం మొదలైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా సంభవించిన మరణాల సంఖ్య గురువారానికి 34కు పెరిగింది. 1,338 మందికి పైగా గాయాలపాలయ్యారు.  

కల్లోల నేపాల్‌ నుంచి బయటపడే దురుద్దేశంతో ఇప్పటికే జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు కొందరు ఏకంగా దేశందాటి పారిపోయేందుకు విఫలయత్నంచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బయిర్‌గనియా చెక్‌పోస్ట్‌ సమీప ప్రాంతం గుండా భారత్‌లోకి చొరబడేందుకు యతి్నంచిన 13 మంది నేపాల్‌ ఖైదీలను భారత బలగాలైన సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) విజయవంతంగా అడ్డుకుంది. సరిహద్దు సమీపంలోని రౌతహాత్‌ జిల్లా కారాగార కేంద్రం నుంచి ఈ ఖైదీలు పారిపోయారని ఎస్‌ఎస్‌బీ గుర్తించింది.

నిబంధనల ప్రకారం వారందరినీ నేపాల్‌ పోలీసులకు ఎస్‌ఎస్‌బీ సైనికులు అప్పగించారు. ఇప్పటిదాకా జైళ్ల నుంచి పారిపోయి సరిహద్దుదాకా చేరుకున్న దాదాపు 60 మంది నేపాలీ ఖైదీలు, ఒక బంగ్లాదేశ్‌ జాతీయుడిని అదుపులోకి తీసుకుని నేపాల్‌ పోలీసులకు అప్పగించామని ఎస్‌ఎస్‌బీ అధికారి వెల్లడించారు.

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)