Breaking News

దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో పెను విషాదం.. 11 మంది మృతి

Published on Thu, 10/02/2025 - 19:37

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్గమ్మను నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్‌ చెరువులోకి దూసుకెళ్లింది. 

మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో దుర్గమ్మ నిమజ్జనోత్సవం విషాదంగా మారింది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ట్రాక్టర్  చెరువులోకి దూసుకెళ్లి 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20 నుంచి 25 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన ఖండ్వా జిల్లా అర్దాలా గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం కోసం చెరువుపై తాత్కాలిక వంతెనపై ఆపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో అందులో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. గురువారం సాయంత్రం 5:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జేసీబీ సహాయంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:00 గంటల సమయానికి 11 మృతదేహాలను వెలికి తీశారు. 

బాధితులను పంధానా ఆసుపత్రికి తరలించడానికి సంఘటనా స్థలంలో పది అంబులెన్స్‌లను మోహరించారు. జిల్లా కలెక్టర్ రిషబ్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ రాయ్ సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు పిల్లలను చికిత్స కోసం ఖాండ్వా ఆసుపత్రికి తరలించారు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)