Breaking News

టీపీసీసీ జంబో కార్యవర్గం

Published on Tue, 06/10/2025 - 03:58

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)లో కొత్తగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. ఈ పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. 67 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ఇందులో 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కాయి.

సోమవారం ఢిల్లీకి వచి్చన సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చల అనంతరం కార్యవర్గ జాబితాను ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమోదించిన జాబితాను సోమవారం రాత్రి పార్టీ విడుదల చేసింది. నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పరి్ణకారెడ్డి, డా.మట్ట రాగమయిలకు అవకాశం ఇచ్చారు. 

మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చోప చర్చలు  
మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ముగ్గురు మంత్రులు అధికారం చేపట్టడంతో వారికి కేటాయించాల్సిన శాఖలపై కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అనుభవం దృష్టా వీరికి ఏయే శాఖలు కేటాయించాలన్న అంశంపై చర్చించారు. సీఎం వద్దే హోం, న్యాయ, మున్సిపల్, విద్య, మైనింగ్‌ వంటి కీలక శాఖలు ఉన్నందున వాటిని కొత్త మంత్రులకు కేటాయించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో ఖాళీగా ఉన్న మరో మూడు స్థానాల్లో మంత్రులుగా ఎవరిని తీసుకోవాలన్న దానిపై చర్చించారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డిలతో పాటు ఇద్దరు మైనార్టీ నేతల పేర్లపైనా చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటే చీఫ్‌ విప్, రెండు విప్‌ల పదవుల భర్తీపైన చర్చ జరిగింది. చీఫ్‌ విప్‌ పదవిని రెడ్డి లేదా వెలమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారని తెలిసింది. 

టీపీసీసీ ఉపాధ్యక్షులు  
1) టి.కుమార్‌ రావు 
2) కె.రఘువీర్‌ రెడ్డి, ఎంపీ 
3) నాయిని రాజేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే 
4) డా. చిక్కుడు వంశీ కృష్ణ, ఎమ్మెల్యే 
5) బల్మూర్‌ వెంకట్, ఎమ్మెల్సీ 
6) బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ 
7) హనుమాండ్ల ఝాన్సీరెడ్డి 
8) బండి రమేశ్‌ 
9) కొండ్రు పుష్పలీల 
10) కోట నీలిమ 
11) బి. కైలాష్‌ కుమార్‌ 
12) నమిండ్ల శ్రీనివాస్‌ 
13) ఆత్రం సుగుణ 
14) గాలి అనిల్‌ కుమార్‌ 
15) చిట్ల సత్యనారాయణ 
16) లకావత్‌ ధన్వంతి 
17) ఎం. వేణుగౌడ్‌ 
18) కోటంరెడ్డి వినయ్‌ రెడ్డి 
19) కొండేటి మల్లయ్య 
20) ఎం.ఏ.ఫహీమ్‌ (సంగారెడ్డి) 
21) ఎస్‌. సురేష్‌ కుమార్‌ 
22) బొంతు రామ్మోహన్‌ 
23) అఫ్సర్‌ యూసుఫ్‌ జాహీ 
24) ఎస్‌. జగదీశ్వర్‌ రావు 
25) నవాబ్‌ ముజాహిద్‌ ఆలంఖాన్‌ 
26) గుమ్ముల మోహన్‌ రెడ్డి 
27) చిన్నపటాల సంగమేశ్వర్‌ 
 
పీసీసీ ప్రధాన కార్యదర్శులు 
1) వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే 
2) సీహెచ్‌ పరి్ణకా రెడ్డి, ఎమ్మెల్యే 
3) డా.మట్ట రాగమయి, ఎమ్మెల్యే 
4) సీహెచ్‌.రాంభూపాల్‌ 
5) ఏ. సంజీవ్‌ ముదిరాజ్‌ 
6) బొజ్జా సంధ్యా రెడ్డి 
7) మల్లాది రాంరెడ్డి 
8) అబ్దేశి సదాలక్ష్మి 
9) ఎం. బేబి స్వర్ణ కుమారి 
10) దారాసింగ్, తాండూరు 
11) జి. శశికళా యాదవ రెడ్డి 
12) ప్రొఫెసర్‌ కత్తి వెంకటస్వామి 
13) ముహమ్మద్‌ అబ్దుల్‌ ఫహీమ్‌ 
14) సంతోష్‌ కుమార్‌ రుద్ర 
15) దుర్గం భాస్కర్‌ 
16) ముహమ్మద్‌ ఖాజా ఫఖ్రుద్దీన్‌ 
17) వి.జగదీశ్వర్‌ గౌడ్‌ 
18) నరేశ్‌ జాదవ్‌ 
19) అల్లం భాస్కర్‌ 
20) డా. గిరిజ షెట్కార్‌ 
21) కొప్పుల ప్రవీణ్‌ కుమార్‌ 
22) ఏ. జంగా రెడ్డి 
23) కస్బా శ్రీనివాస్‌ రావు 
24) దుడ్డిల్ల శ్రీనివాస్‌ 
25) బద్దం ఇంద్రకరణ్‌ రెడ్డి 
26) చరగాని దయాకర్‌ 
27) పీసారి మహిపాల్‌ రెడ్డి 
28) గజ్జెల కాంతం 
29) ఏడుపుగంటి సుబ్బా రావు 
30) చకిలం రాజేశ్వర్‌రావు 
31) ఎర్ల కొమరయ్య 
32)డా.ఏ.రవిబాబు 
33) నాగ సీతారాములు 
34) సనెం శ్రీనివాస్‌ గౌడ్‌ 
35) పృథ్వి చౌదరి వేణుల 
36) అంబడి రాజేశ్వర్‌ 
37) డి.డి.వెంకట్‌ రాజ్‌ 
38) బొడ్డిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి 
39) పల్లె శ్రీనివాస్‌ గౌడ్‌ 
40) మొహమ్మద్‌ సబీర్‌ అలీ 
41) కట్ల రంగారావు 
42) పి. శ్రీనివాస్‌ రెడ్డి 
43) మడు సత్యనారాయణ గౌడ్‌ 
44) టోపాజీ అనంత కిషన్‌ 
45) వి. రామారావు గౌడ్‌ 
46) అచ్యుత్‌ రమేష్‌ బాబు 
47) పెద్దనొల్ల బాలమురళీ కృష్ణ (చిన్న) 
48) ఎం. రాజీవ్‌ రెడ్డి 
49) ఆదంరాజ్‌ దేకపాటి 
50) షమీం ఆఘా 
51) ఈ.వి.శ్రీనివాస్‌ రావు 
52) మిథున్‌ రెడ్డి 
53) అమొగోత్‌ వెంకటేశ్‌ పవార్‌ 
54) రాయగిరి కల్పనా యాదవ్‌ 
55) రాజేష్‌ కాశిపాక 
56) రహమత్‌ హుస్సేన్‌ 
57) పి. ప్రసన్న కుమార్‌ శర్మ 
58) ముహమ్మద్‌ అసదుద్దీన్‌ 
59) నందిమల్ల యాదయ్య ముదిరాజ్‌ 
60) దైదా రవీందర్‌ 
61) ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 
62) గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి 
63) జి. నాగభూషణం 
64) ఉపేందర్‌ రెడ్డి 
65) ధర్మారావు 
66) నూతి సత్యనారాయణ గౌడ్‌ 
67) దుర్గాప్రసాద్‌ 
68) డా. సి. వేంకటగోవింద్‌ రావు 
69) పెండ్లి శ్రీనివాసులు రెడ్డి

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)