టపాసుల ఎఫెక్ట్‌.. ఢిల్లీని కమ్మేసిన పొగ

Published on Fri, 11/01/2024 - 07:53

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం(నవంబర్‌ 1) తెల్లవారుజామున పొగ కమ్మేసింది. గురువారం రాత్రి దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ టపాసులు కాల్చారు. దీంతో ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది. 

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని నోయిడా, గురుగ్రామ్‌లో వాయు కాలుష్యం ఒక్కసారిగా ఒక్కసారిగా పెరిగిపోయింది. రోడ్లపై విజిబిలిటీ తగ్గింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ)పై వాయునాణ్యత శుక్రవారం ఉదయం ఆరు గంటలకు  395(వెరీపూర్‌)గా నమోదైంది. ఈ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీతో పాటు పొరుగునే ఉన్న పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ వాయునాణ్యత ఒక్కసారిగా క్షీణించింది.

కాలుష్యంతో నురగలు కక్కుతున్న యమున

 కాగా, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పంజాబ్‌, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీ కాలుష్యం శీతాకాలం ప్రారంభమవగానే పెరిగిపోతోంది. పంట వ్యర్థాలకు తోడు ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చే డీజిల్‌ వాహనాలు కూడా కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం దీపావళి రోజు టపాసులను కాల్చడాన్ని నిషేధించింది. అయితే ఢిల్లీ వాసులు ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా టపాసులు కాల్చి పండుగ జరుపుకోవడంతో కాలుష్యం పెరిగిపోయింది. 

ఇదీ చదవండి: బాణసంచా కాల్చేవారిపై పోలీసుల దృష్టి

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)