Breaking News

తాత్కాలికంగా బంద్‌.. కస్టమర్లు మన్నించాలి.. మెక్‌డొనాల్డ్‌, సబ్‌వే షాకింగ్‌ నిర్ణయం!

Published on Mon, 07/24/2023 - 16:33

న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని వారాలుగా ఎక్కడ విన్నా, ఏ వార్త చూసిన టమోట పేరే వినపడుతోంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డ్‌ ధరలు పలకడంతో ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. దీని ధరలు దడపుట్టిస్తుండడంతో సామాన్య ప్రజలు వంటలో టమోటాకు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. తాజాగా ఇంట​ర్నెషనల్‌ సంస్థలైన సబ్‌వే, మెక్‌డొనాల్డ్‌ కూడా టమోట దెబ్బను తట్టుకోలేక షాకింగ్‌ నిర్ణయాన్ని తీసుకున్నాయి.


భార‌త్‌లో ప‌లు స‌బ్‌వే అవుట్‌లెట్లు త‌మ స‌లాడ్స్‌, శాండ్‌విచ్‌ల్లో ట‌మాట‌ల‌ను జోడించ‌డం నిలిపివేశాయి. నాణ్య‌తా ప‌ర‌మైన అంశాల‌తో పాటు అధిక ధ‌ర‌ల కార‌ణంగా స‌బ్‌వే ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవల పలు కారణాల వల్ల కిచెన్‌లోకి కావాల్సిన ప్రధానమైన వస్తువుల ధరలు 400 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా టమోట ధరలు కన్నీళ్లను తెప్పిస్తోంది. మరో వైపు ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ కొన్ని మార్కెట్లలో రికార్డు స్థాయికి దారితీసింది. ఇటీవల ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లోని ఒక సబ్‌వే అవుట్‌లెట్‌  ఓ బోర్డులో ఇలా రాసుంది. " కస్టమర్లు మన్నించాలి. తాత్కాలికంగా టమోటాలు అందుబాటులో లేదని తెలిపింది.


వీలైనంత త్వరగా టమోట సరఫరాలను పునరుద్ధరించడానికి తాము చురుకుగా పని చేస్తున్నామని అవుట్‌లెట్ కస్టమర్లకు హామీ ఇచ్చింది. భారతదేశంలోని సబ్‌వే అవుట్‌లెట్‌లలో దాదాపు వందల సంఖ్యల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం ద్వారా ప్రభావితమైన అవుట్‌లెట్‌ల ఖచ్చితమైన సంఖ్య అస్పష్టంగానే ఉంది. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా మ‌రికొన్ని స‌బ్‌వే అవుట్‌లెట్స్‌లో ట‌మాటాల‌ను స‌ర్వ్ చేయ‌డం కొన‌సాగుతోంది. స‌బ్‌వే, మెక్‌డొనాల్డ్స్ బాట‌లోనే డామినోస్‌, కేఎఫ్‌సీ ట‌మాటాల వాడ‌కం త‌గ్గించాయి.

చదవండి: ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి!

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)