Breaking News

టోల్‌ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి..

Published on Mon, 07/17/2023 - 18:48

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. టోల్ పేమెంట్ చేయాలని అడిగినందుకు టోల్‌ ఫ్లాజా ఉద్యోగినిపై ఓ మహిళ దాడి చేసింది. జుట్టు పట్టుకుని కింద పడేసింది. ఈ ఘటన జాతీయ రహదారి 91పై జరిగింది. సీసీటీవీ ఆధారంగా రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అయ్యాయి. 

టోల్‌ గేట్‌ వద్ద ఓ కారు వచ్చి ఆగింది. టోల్‌ ఫ్లాజా సమీప గ్రామస్థులమని చెబుతూ.. పంపించవలసిందిగా కోరారు. ఆ గ్రామస్థులేనడానికి ఏదైనా ఆధారం చూపించమని టోల్ ఫ్లాజా ఉద్యోగిని వారికి అడిగింది. దీంతో కారులో నుంచి బయటకు దిగిన మహిళ.. సదరు ఉద్యోగినితో వాగ్వాదానికి దిగింది. అనంతరం క్యాబిన్‌లోకి వచ్చి ఉద్యోగిని జుట్టు పట్టుకుని దాడి చేసింది. బాధితురాలిని బూతులు తిడుతూ కింద పడేసింది. సహచర ఉద్యోగులు చొరవ తీసుకుని ఆ మహిళను నిలువరించే ప‍్రయత్నం చేశారు.

ఈ ఘటనపై టోల్ ఫ్లాజా యాజమాన్యం సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ టోల్‌ ఫ్లాజాకు సమీప గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఐడీ కార్డు అడిగిన నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం ప్రారంభమైనట్లు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్‌.. ధర చూసి షాకైన యూట్యూబర్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)