Breaking News

టీఎంసీకి భారీ షాక్‌.. ఎన్నికలకు ముందే తిరుగుబాటు

Published on Sun, 01/04/2026 - 11:42

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ అనూహ్యంగా తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తన మేనమామ, దివంగత కాంగ్రెస్ దిగ్గజం గనీ ఖాన్ చౌదరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.

వచ్చే ఏప్రిల్‌తో మౌసమ్ నూర్ రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఆమె త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిల్లా నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె 2009 నుండి 2019 వరకు మాల్దా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా గతంలో పశ్చిమ బెంగాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా ఆమె కీలక బాధ్యతలు చేపట్టారు.

న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మౌసమ్ నూర్ అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సుభంకర్ సర్కార్ సమక్షంలో ఆమె పార్టీలోకి తిరిగి ప్రవేశించారు. పార్టీ అగ్రనేతలు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ చేరికతో బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

కాంగ్రెస్‌లో చేరికపై మౌసమ్ నూర్ స్పందిస్తూ ‘పశ్చిమ బెంగాల్‌కు మార్పు అవసరం, ఆ మార్పు నా నుండే మొదలు కానివ్వండి’ అని వ్యాఖ్యానించారు. తాను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, కాంగ్రెస్ సిద్ధాంతాలైన లౌకికవాదం, అభివృద్ధి, శాంతిపై మాల్దాలోని ప్రజలకు గట్టి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపినట్లు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తానని మౌసమ్ నూర్ అన్నారు. 

ఇది కూడా చదవండి: Bangladesh: హిందువుల సంచలన నిర్ణయం.. ఎన్నికలపై పిడుగుపాటు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)