ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
హాస్పిటల్లో చేరిన టీఎంసీ సీనియర్ నేత
Published on Thu, 07/04/2024 - 13:18
కోల్కతా: టీఎంసీ సీనియర్నేత ముకుల్ రాయ్ గురువారం ఆస్పత్రిలో చేరారు. తన నివాసంలోని బాత్రూంలో జారిపడి స్పృహ కోల్పోవటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల ముకుల్ స్పృహ కోల్పోయే ముందు వాంతులు చేసుకున్నారని కుటంబసభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన బాత్రూంలో జారిపడటంతో తలకు గాయం అయింది. దీంతో ఆయన్ను హాస్పిటల్కు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ పలు టెస్ట్ల రిపోర్టుల కోసం ఎదురు చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
టీఎంసీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్.. 2017లో బీజేపీలో చేరిన ఆయన 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ కృష్ణానగర్లో గెలుపొందారు.అనంతరం ఆయన మళ్లీ టీఎంసీలో చేరారు.
Tags : 1