ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ
Breaking News
Times Now ETG Survey on Elections 2024: మళ్లీ ఎన్డీఏనే!
Published on Thu, 12/14/2023 - 05:04
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొడుతుందని టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఒపీనియన్ పోల్ బుధవారం వెల్లడించింది. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా 323 సీట్లొస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 163 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది.
ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 57 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడించింది. ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనైతే ఆ పార్టీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేస్తుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 354 సీట్లు రావడం తెలిసిందే. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు 93 సీట్లు రాగా ఇతరులకు 96 దక్కాయి.
Tags : 1