Breaking News

Lok sabha elections 2024:ఎన్డీఏ హ్యాట్రిక్‌ ఖాయం

Published on Fri, 04/05/2024 - 05:54

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని టైమ్స్‌ నౌ–ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలొస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్‌ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్‌సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49 శాతం ఓట్లు ఒడిసిపడుతుందని, ఇండియా కూటమికి 34 శాతం వస్తాయని తేల్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాలకు గాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్‌సభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాట డీఎంకేకు కూడా 22 స్థానాలొస్తాయని, పశి్చమ బెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు 19, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 11 సీట్లొస్తాయని తెలిపింది. కేజ్రీవాల్‌ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కని్పస్తున్న ఆప్‌ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం.

ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్‌ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్‌ఎస్‌ 2 స్థానాలకు పరిమితబమవుతుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీయే ఏకంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెస్‌ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లొచ్చాయి.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు