Breaking News

తీహార్‌ జైలులో ఖైదీల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

Published on Sat, 07/27/2024 - 12:05

ఢిల్లీలోని తీహార్ జైలులో మరోమారు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఖైదీల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. జైలులోని ఫోన్ రూమ్‌లో ఈ గొడవ జరిగింది. లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే లోకేష్ అనే ఖైదీ ఈ దాడికి పాల్పడ్డాడని సమాచారం. లోకేష్ సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ జైలులో ఉన్నారు. జైలులోనే దాడికి ప్లాన్ చేసిన లోకేష్‌ తన సహచరులు హిమాన్ష్, అభిషేక్‌ల సాయం తీసుకున్నాడు. అవకాశం చూసుకున్న లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్‌లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు.  చికిత్స అనంతరం ఒక ఖైదీని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్‌ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)