Breaking News

కేజ్రీవాల్‌ను చూసేందుకు.. భార్య సునీతకు అనుమతి నిరాకరణ

Published on Mon, 04/29/2024 - 11:42

న్యూఢిల్లీ: తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన సతీమణిి సునీతకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ ‌జైల్లో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే సోమవారం ఆయనను కలిసి మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత అనుమతి కోరారు. అయితే ఇందుకు జైలు అధికారులు అంగీకరించలేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించింది. సునీత కలిసేందుకు అధికారులు అనుమతించకపోడంపై కారణాలు కూడా చెప్పలేదని పేర్కొన్నాయి.

కాగా ఢిల్లీ మంత్రి  ఆతిశీ నేడు 12.30 గంటలకు కేజ్రీవాల్‌ను కలవనున్నారు. మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ కూడా అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు.ఈ ఇద్దరి సమావేశాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో సునీత అభ్యర్థనను తిరస్కరించామని జైలు వర్గాలు తెలిపాయి. ఇద్దరు నేతల భేటీ తర్వాత ఆమెను తన భర్తను కలిసేందుకు అనుమతిస్తామని పేర్కొన్నాయి. 

జైలు నియమాల ప్రకారం.. ఒక ఖైదీని ఒకేసారి ఇద్దరు వ్యక్తులు, వారంలో గరిష్టంగా నలుగురు కలవచ్చు. ఇదిలా ఉండగాఢిల్లీ ముఖ్యమంత్రిని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న  తన అధికారిక నివాసంలో అరెస్టు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి తీహార్‌ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీఆల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌ సతీమణి సునీత ఆప్‌ తరపున ప్రచారాన్ని  నిర్వహిస్తున్నారు. ఆదివారం పశ్చిమ ఢిల్లీ అభ్యర్ధి మహాబల్‌ మిశ్రా తరపున ఆమె ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తన భర్త కేజ్రీవాల్‌ను సింహంతో పోల్చారు. దిల్లీలో పాఠశాలలు నిర్మించడం, ఉచిత విద్యుత్‌ అందించడం, మొహల్లా క్లీనిక్‌లను ప్రారంభించినందువల్లే తన కేజ్రీవాల్‌ జైలుకెళ్లారన్నారు. ‘భారతమాత బిడ్డగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి. నియంతృత్వానికి మీ ఓటుతో సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని కోరారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)