Breaking News

పులికి మరో ప్రాణం బలి

Published on Sat, 12/07/2024 - 10:14

ముంబై: ఇటీవలి కాలంలో ‍గ్రామాల్లో పులుల సంచారం ఎక్కువైంది. పంట పొలాల్లోకి వస్తున్న పులులు.. ప్రజలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో పులి దాడిలో ఓ గర్భిణి మరణించింది. దీంతో, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వివరాల ప్రకారం.. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రాంతంలో శనివారం ఉదయం పులి దాడి ఘటన వెలుగు చూసింది. పులి దాడిలో ఓ గర్భిణి మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (21) పులి దాడిలో మరణించిన విషయం తెలిసిందే. నజ్రుల్‌ నగర్‌ విలేజ్‌ నంబర్‌ 13–11 మధ్య తన సొంత పత్తి చేలో పత్తి తీస్తుండగా.. ఉదయం 7 గంటల సమయంలో అడవి నుంచి వచ్చిన పులి ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది. లక్ష్మిపై పులి దాడి చేయటాన్ని గుర్తించిన తోటి కూలీలు.. గట్టిగా కేకలు వేసి సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో కొందరు వ్యక్తులు కర్రలతో వచ్చి పులిని బెదిరించటంతో లక్ష్మిని వదిలి అది అడవిలోకి పారిపోయింది.

మరో ఘటనలో సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్‌30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్‌ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది. పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్‌(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  
 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)