Breaking News

విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌రేప్‌.. తమిళనాడులో వెలుగు చూసిన దారుణం

Published on Thu, 02/06/2025 - 09:28

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోయారు. సభ్య సమాజం తల దించుకునేలా టీచర్లు వ్యవహరించారు. ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో, ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో మైనర్‌ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని గర్భం దాల్చింది. అసలు విషయం తన తల్లికి చెప్పడంతో ఆవేదన చెందిన ఆమె.. బిడ్డను గత నెల రోజులుగా పాఠశాలకు పంపించలేదు. స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్‌ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిసింది.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే శిశు సంక్షేమ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితురాలితో ఫిర్యాదు చేయించారు. దీంతో, బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, రంగంలోకి దిగిన శిశు సంక్షేమ శాఖ అధికారులు.. దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు..  ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్‌(37)ను అరెస్ట్‌ చేశారు. ఇక, ఈ ఘటన చర్చనీయాంశంగా మారడంతో స్థానికులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు మరోవైపు.. ఈ ఘటన అనంతరం వారిని జిల్లా ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ సస్పెండ్‌ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తమిళనాడులో వరుస లైంగిక దాడుల ఘటనలు స్టాలిన్‌ సర్కార్‌కు మచ్చ తెస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో, ప్రతిపక్ష బీజేపీ నిరసనలు చేపట్టింది. స్టాలిన్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)