Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

Published on Tue, 01/30/2024 - 18:39

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం(జనవరి 30) ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని, మరో 14 మంది గాయపడ్టట్లు బస్తర్‌ జిల్లా పోలీసులు తెలిపారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు చికిత్స నిమిత్తం తరలిస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన వారిని కోబ్రా కానిస్టేబుళ్లు సి. దేవన్, పవన్‌ కుమార్‌, సీఆర్పీఎఫ్‌ జవాను లాంధర్‌ సిన్హాగా గుర్తించారు. 

సుఖ్మా, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులోని టేకులగూడెం గ్రామంలో మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్‌ పెట్టేందుకు సోమవారమే పారామిలిటరీ సిబ్బందితో బేస్‌ క్యాంపుకు  ఏర్పాటు చేశారు. టేకులగూడెం సమీపంలోని జోనగూడ, అలిగూడ గ్రామాల మధ్య కోబ్రా, సీఆర్పీఎఫ్‌ బలగాలు మంగళవారం ఉదయం కూంబింగ్‌కు వెళ్లాయి. ఈ సమయంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. వెంటనే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఉదయం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మూడేళ్ల క్రితం 2021లో టేకులగూడెం అడవుల్లోనే  మావోయిస్టులు, భద్రతాబలగాలకు భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో అప్పట్లో 21 మంది జవాన్లు మృతి చెందారు. మళ్లీ తిరిగి ఇప్పుడు అదే ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించడంతో పాటు భారీ సంఖ్యలో జవాన్లు గాయపడటం పోలీసులను కలవరపెడుతోంది.

ఇదీచదవండి.. అజ్ఞాతం వీడిన సోరేన్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)